స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'రేసుగుర్రం' చిత్రం 2014లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కింది. తన కొడుకు అయాన్ పుట్టినవేళా విశేషం తన జీవితం పూర్తిగా మారిపోయిందని అంటూ ఆనందపడుతున్నాడు. బన్నీ, అయితే సినిమా విజయానికి తన కొడుకును కారణంగా చూపను అంటున్నాడు. దర్శకుడు సురేంద్రరెడ్డి ఏడాది కష్టం.. టీం సమిష్టి కృషి మూలంగానే ఈ చిత్రం భారీ విజయం సాధించిందని అల్లు అర్జున్ స్పష్టం చేసాడు. అయాన్ పుట్టిన తర్వాత జీవితం చాలా కొత్తగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. తండ్రయిన తర్వాత ఆనందాన్ని దేనితో వెలకొట్టలేం. ఆ అనుభూతి ఎలా ఉంటుందో తండ్రి అయిన వారికే తెలుస్తుంది అంటున్నాడు బన్నీ. తన కొడుకుతో తొలిసారి విదేశీయాత్రకు వెలుతున్నాడు. సౌతాఫ్రికాకు వెళ్లి అక్కడ న్యూ ఇయర్ వేడుకులను తన భార్య స్నేహారెడ్డి, తనయుడు అయాన్ గడిపేందుకు రెడీ అయ్యాడు. జనవరి రెండోవారంలో ఆయన తిరిగి తన ఫ్యామిలీతో ఇండియా తిరిగివస్తాడని తెలుస్తోంది.