Advertisementt

పవన్, ప్రభాస్ ల మధ్య పోటాపోటీ..!

Wed 31st Dec 2014 05:04 AM
pawan kalyan,potapotee,gopala gopala,bahubali,prabhas,january,april,vathaavaranam.,teaser,making trailer,youtube,fighting  పవన్, ప్రభాస్ ల మధ్య పోటాపోటీ..!
పవన్, ప్రభాస్ ల మధ్య పోటాపోటీ..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్, ప్రభాస్ ల మధ్య పోటాపోటీ వాతావరణం ఏర్పడింది. ఈ ఇద్దరు ప్రస్తుతం 'గోపాల గోపాల', 'బాహుబలి' చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'గోపాల గోపాల' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు రెడీ అవుతుండగా, ప్రభాస్ 'బాహుబలి' మాత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతోంది . ఇలా వీరిద్దరి చిత్రాలు ఒకేసారి విడుదల కాకపోయినప్పటికీ వీరి చిత్రాల మధ్య నెటిజన్లలో పోటాపోటీ వాతావరణం నడుస్తోంది. 'గోపాల గోపాల' మోషన్ టీజర్ కు 10లక్షల క్లిక్స్ లభించాయి. అదే సమయంలో తాజాగా విడుదలైన 'బాహుబలి' మేకింగ్ ట్రైలర్ 10లక్షల క్లిక్స్ ను దాటింది. మొత్తానికి యూట్యూబ్ లో ఈ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఈ రెండు చిత్రాల హవానే యూట్యూబ్ లో సాగుతుండడం విశేషం. మరి నెటిజన్లు ఇంతగా ఆదరిస్తుండటంతో వారి అభిమానం, ఆసక్తి ఆయా సినిమాలు విడుదలైన తర్వాత కూడా అదే స్థాయిలో ఉంటుందో లేదో వేచిచూడాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ