Advertisementt

గెస్ట్ పాత్రలతో బిజీ.. బిజీ..!

Wed 31st Dec 2014 03:23 AM
bahubali,rudhrama devi,rana,cinema,hero,solo,tollywood,bollywood,kollywood,guest roles,siddharth,manchu lakshmi,adavi seshu  గెస్ట్ పాత్రలతో బిజీ.. బిజీ..!
గెస్ట్ పాత్రలతో బిజీ.. బిజీ..!
Advertisement
Ads by CJ

భారీ ప్రతిష్టాత్మక చిత్రాలైన 'బాహుబలి, రుద్రమదేవి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న రానా దగ్గుబాటికి హీరో కావాల్సిన అర్హతలతోపాటు, సినిమా బ్యాగ్రౌండ్ కూడా పుష్కలంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు సోలో హీరోగా హిట్ కొట్టలేకపోయాడు. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఆయనకు అవకాశాలు వస్తున్నప్పటికీ అవన్నీ కాసేపు తెరపై మెరిసే గెస్ట్ పాత్రలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హీరోగా ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయిన ఆయనకు గెస్ట్ పాత్రలు మాత్రం వెతుక్కుంటూ వస్తుండడం విశేషం. ఆ మధ్య సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'సమ్ థింగ్ సమ్ థింగ్' తో పాటు తమిళంలో రాధామోహన్ చిత్రంలో కూడా ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లో 'బేబీ' అనే చిత్రంలో కనిపించనున్నాడు. ఇలా గెస్ట్ రోల్స్ కు కరెక్ట్ గా సూట్ అవుతాడనే పేరు రావడం ఆయన మంచికో చెడుకో అర్ధం కావడం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. తాజాగా ఆయన మంచు లక్ష్మి, అడవి శేషు ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా కీలకమైన గెస్ట్ రోల్ చేస్తుండటం విశేషం. మొత్తానికి హీరోగా సక్సెస్ ల మీద కన్నా, అతిథి పాత్రలు, వివాదాలతో ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉండటం విసేశామని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ