టాలీవుడ్ సంగతి పక్కన పెడితే బాలీవుడ్ లో సినిమా అంతా కనిపించి , నవరసాలు పోషించే హీరోయిన్ల కంటే ఒక్క పాటలో కనిపించి మురిపించే ఐటెంగర్ల్స్ హవా కొనసాగుతోంది. హీరోయిన్ ఎవరు? అనే విషయాన్ని పట్టించుకోకుండా ఐటెం సాంగ్ ఎవరు చేస్తున్నారు? అనే దానిపైనే ఎక్కువ చర్చ నడుస్తోంది. 'డాలీ కీ డోలీ' చిత్రంలో హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటిస్తున్నప్పటికీ ఈ చిత్రంలో మలైకా అరోరా చేసిన ఐటెం నెంబర్ మీదే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇక తెలుగు 'ఒక్కడు' కు రీమేక్ గా వస్తోన్న 'తేవర్' చిత్రంలో హీరోయిన్ సోనాక్షి కంటే ఐటెం సాంగ్ చేసిన శ్రుతికే అక్కడ ఎక్కువ ప్రచారం లభిస్తోంది. 'ఉంగ్లీ' చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఐటెం సాంగ్ చేసిన శ్రద్ధాకపూర్ కు మంచి పేరు వచ్చింది. ఆ పాట బాగా హిట్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు కనిపిస్తాయి. మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ లో ఐటెంగర్ల్స్ హవా నడుస్తోందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో వేచిచూడాలి..!