Advertisementt

కలిసొచ్చిన సంప్రదాయం..!

Wed 31st Dec 2014 12:36 AM
heroin,sreya,hit,sampradaayam,manam,pawan kalyan,venkatesh,gopala gopala,sentiment,crazy,chathrapathi,don seenu,nagarjuna  కలిసొచ్చిన సంప్రదాయం..!
కలిసొచ్చిన సంప్రదాయం..!
Advertisement
Ads by CJ

  హీరోయిన్ శ్రియ ఎంత కవ్వించి, రెచ్చగొట్టినా కూడా చాలాకాలంగా కలిసిరాలేదు. ఈ అమ్మడు ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. అయితే నిండుగా చీర కట్టుకొని సంప్రదాయబద్దంగా కనిపించిన 'మనం' చిత్రం ఆమెకు మంచి హిట్ అందించింది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'గోపాల గోపాల' చిత్రంలో కూడా సంప్రదాయబద్దంగా, ఓ మధ్య తరగతి గృహిణిగా చేస్తున్న లుక్ ఇటీవల బయటకు వచ్చింది. దీంతో ఆమె మరోసారి హిట్ కొట్టడం ఖాయమని సెంటిమెంట్ వాసులు అంటున్నారు. మొత్తానికి ఈ క్రేజీ చిత్రంలో ఆమె మరోసారి నిండుగా, సంప్రదాయబద్దంగా కనిపిస్తోంది. గత పదేళ్ళ నుండి ఆమె ఎంతగా రెచ్చిపోయి నటించినా ఫలితం మాత్రం కనిపించలేదు. అప్పుడెప్పుడో వచ్చిన 'చత్రపతి, డాన్ శీను' చిత్రాలు హిట్ అయినప్పటికీ ఆమెకు మాత్రం ఎలాంటి గుర్తింపును తీసుకొని రాలేకపోయాయి. మరి తన రెండో ఇన్నింగ్స్ లో ఇప్పటికే నాగార్జున సరసన హిట్ కొట్టిన ఆమె.. వెంకటేష్ వంటి మరో సీనియర్ హీరోతో ఆమె హిట్ ను రుచి చూడటం ఖాయంగా కనిపిస్తోంది.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ