Advertisementt

పీకే పై వర్మ క్లారిటీ..!

Tue 30th Dec 2014 07:12 AM
ramgopal varma,shankar,i trailer,release,pawan kalyaan,gopala gopala,pk,twitter,abhimaanulu,ameer khan  పీకే పై వర్మ క్లారిటీ..!
పీకే పై వర్మ క్లారిటీ..!
Advertisement
Ads by CJ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల శంకర్ 'ఐ' ట్రైలర్ విడుదల అనంతరం పొగడ్తలు గుప్పిస్తూ ట్విట్టర్ లో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్ల లో కొన్ని పవన్ కళ్యాణ్  అభిమానులకు కోపం తెప్పించాయి. 'ఐ' సినిమా రిలీజ్ తర్వాత సంక్రాంతి కాస్త శంకర్ రాత్రిగా అవుతుందని, శంకర్ గురించి తెలియని డమ్ పీపుల్ మాత్రమే సినిమాలు విడుదల చేస్తారు. మరి పీకే సంగతి ఏమవుతుందో అని ట్వీట్ చేసాడు. అయితే వర్మ పీకే ప్రస్తావన తేవడం పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం తెప్పించింది. పవన్ కళ్యాణ్ ను షార్ట్ కట్ లో పీకే అని పిలుస్తుంటారు. వర్మ కూడా గతంలో పవన్ ను తన ట్విట్టర్ల లో అలాగే సంభోదించేవాడు. అంతేగాక పవన్ నటించిన 'గోపాల గోపాల' కూడా సంక్రాంతి రేసులో ఉంది. ఈ నేపధ్యంలో వర్మపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వెల్లడించారు. దీంతో వెంటనే స్పందించిన వర్మ పీకే అంటే పవన్ కళ్యాణ్ అని అంతా నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను మాట్లాడింది.. అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం గురించి.. శంకర్ 'ఐ' సినిమా విడుదలైతే పీకే సినిమా ఆడటం కష్టం అనేది నా మాటల్లోని అంతరార్ధం.. అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ