హీరోయిన్ల మధ్య పోటీ వాతావరణం సహజం. ఈ క్రమంలో అప్పుడప్పుడు ఒకరంటే ఒకరికి పడనట్లు వ్యవహరిస్తారు. అయితే ఒకరి గురించి మరొకరు నెగెటివ్ కామెంట్లు చేసుకోవడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఎవరైనా అలా మాట్లాడారంటే సెన్సేషన్ న్యూస్ అవుతుంది. తాజాగా హీరోయిన్ చార్మి హీరోయిన్ ఇలియానా గురించి నెగెటివ్ కామెంట్లు చేసింది. ఇలియానాను మేకప్ లేకుండా అస్సలు చుడలేమంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఇలియానా, చార్మి కలిసి ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రాఖీ' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఇలియానా బక్కపలుచని సౌందర్యం ఇష్టపడని కొందరు చార్మి మాటలు నిజమే అని అంటుంటే.. ఇలియానా ఫ్యాన్స్ మాత్రం చార్మి ఇలా మరొకరి గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడం తగదని అంటున్నారు. మరి చార్మి చేసిన కామెంట్ల విషయం ఇలియానా చెవిన పడ్డాయో? లేదో? మరి ఆమె ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి..!