Advertisementt

ఈ ఇయర్ చిరు 150 న్యూస్ లేనట్లే..!

Mon 29th Dec 2014 11:22 AM
telugu industry,chiranjeevi,raajakeeyalu,150 chithram,katha,raam charan,family,mega milestone,progress  ఈ ఇయర్ చిరు 150 న్యూస్ లేనట్లే..!
ఈ ఇయర్ చిరు 150 న్యూస్ లేనట్లే..!
Advertisement
Ads by CJ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని మెగాభిమానులకు పెద్దన్నయ్య గా వున్న మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళడం తో మెగాభిమానులు ఎంతో నిరాశకు లోనయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయాలలో మార్పులతో చిరు మళ్లీ సినిమాల్లో కి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. తన 150 అతి త్వరలోనే అని హింట్ కూడా ఇచ్చారు.  ఎప్పుడైతే  150వ చిత్రాన్ని చిరు  చేస్తానని అధికారకంగా వెల్లడించారో అప్పటి నుండి మెగా అభిమానులలో నిరీక్షణ ఎక్కువైంది. ఈ ఇయర్(2014) లోనే మూవీ సెట్స్ పైకి వస్తుందని కూడా మెగా క్యాంపు నుండి వార్తలు వచ్చాయి.
అయితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రానికి ఇంకా కథ సిద్ధం కాలేదనే తెలుస్తుంది. గత కొన్ని నెలల నుంచి రామ్ చరణ్, చిరంజీవి చాలా కథలను విన్నా.. కానీ అవేవి వాళ్ళని తృప్తి పరచలేదని తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలోకి  తీసుకున్నట్లయితే మెగా ఫ్యామిలీ ఈ 150 ని నిర్మించే ప్రాసెస్ చాలా నెమ్మదిగా వుందనిపిస్తుంది. ఈ ఇయర్ లో ఇక  ఈ మెగా మైల్ స్టోన్ ఫిల్మ్ జీరో ప్రోగ్రెస్ అనే చెప్పుకోవచ్చు. మరి రాబోయే 2015 లోనైనా ఈ మెగా వెయిటింగ్ మూవీ గురించి గుడ్ న్యూస్ వస్తుందేమో చూద్దాం. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ