అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో రూపొందిన 'పీకే' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అప్పుడే 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరిన్ని రికార్డుల దిశగా దూసుకెళ్తున్నఈ చిత్రం కలెక్షన్ల పరంగానే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా చూరగొంటోంది. మంచి కామెడీతో పాటు అంతర్లీనంగా అధ్బుతమైన మెసేజ్ తో రూపొందిన ఈ చిత్రానికి అమీర్ ఖాన్ నటన పెద్ద ఎస్సెట్ గా మారింది. ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకునే దిశగా కొందరు తెలుగు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీరిలో పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ , నిర్మాత శరత్ మరార్ కూడా ఉన్నాడట. అయితే ఈ చిత్రం హక్కులను తీసుకునే ముందు ఆయన పవన్ ను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పవన్ అయితేనే న్యాయం చేస్తాడనే ఆలోచనలో ఉన్న ఆయన పవన్ ఓకే అంటే ఈ చిత్రం హక్కులను పొందేందుకు పోటీపడుతున్నాడు. ఇటీవల కాలంలో రీమేక్ లు , మరీ ముఖ్యంగా బాలీవుడ్ రీమేక్ ల పై ఇంట్రెస్ట్ చూపుతున్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపైనే శరత్ మరార్ తుది నిర్ణయం ఆధారపడివుందని అంటున్నారు.