ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సినిమా చేస్తోన్న దర్శకరచయిత కొరటాల శివ ఆ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కాగా ఆయన తదుపరి చిత్రాన్ని కూడా ఖరారు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇటీవల ఆయన అల్లు అర్జున్ ను కలిసి కథ చెప్పినట్లు తెలుస్తోంది. అది విన్న వెంటనే బన్నీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన తర్వాత బన్నీ నటించనున్న చిత్రం కొరటాల శివదే అని సమాచారం. 'మిర్చి' వంటి యాక్షన్ కమ్ సెంటిమెంట్ మిక్స్ చేసిన మాస్ మసాలా కథ అని తెలుస్తోంది. కాగా మహేష్ బాబు తో కొరటాల శివ చేస్తున్న చిత్రం తాజా షెడ్యూల్ త్వరలో సౌత్ ఆఫ్రికాలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవి కానుకగా మే 1వ తేదీన విడుదల చేస్తారని సమాచారం.