తమిళ, తెలుగు భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఐ'. శంకర్ దర్శకత్వంలో విక్రమ్, అమీ జాక్సన్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జనవరి 9 విడుదల చేయాలని భావిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ఆస్కార్ రవి చంద్రన్ నిర్మించగా, తెలుగులో ఆస్కార్ ఫిలింస్ తో పాటు మెగాసూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా తమిళంలో ఆల్ రెడీ విడుదలై సంచలనం సృష్టిస్తోన్న ఈ చిత్రమ పాటలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించడానికి వస్త్న్నాయి. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 30న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో 5 వేల మంది సభికుల మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా ఈ వేడుకకు చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్ తో పాటు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబులు హాజరవుతరంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా సౌత్ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగా స్టార్ చిరంజీవి హాజరవుతున్నారని సమాచారం. మరి ఈ వేడుక మరెన్ని సంచలనాలకు వేదిక కానుందో చూడాలి..!