Advertisementt

చిన్నదానలో... నితిన్ మిస్టేక్!

Sat 27th Dec 2014 02:09 AM
chinnadana nekosam,nithin,gundejaari gallanthayyinde,gay,repeat,comedy,scene,minus point,thappu  చిన్నదానలో... నితిన్ మిస్టేక్!
చిన్నదానలో... నితిన్ మిస్టేక్!
Advertisement
Ads by CJ

నితిన్, మిస్టీ జంటగా నటించిన చిత్రం చిన్నదాన నీకోసం. ఎ.కరుణాకరన్ దర్శకుడు. ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలు. అనూప్ రూబెన్స్ స్వరాల్ని అందించారు. ఈ చిత్రం ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజున ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ ఫలితాన్ని మాత్రమే రాబట్టుకోగలిగింది. దీనికి ఒక కారణం కామెడీ అనే చెప్పుకోవచ్చు. గుండెజారి గల్లంతయ్యిందే సినిమా లో జోష్ రవి పండించిన గే కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ సినిమా హిట్ అవడానికి ఒక కారణం కూడా అయింది . అయితే అదే కామెడీని నితిన్ ఈ చిన్నదాన నీకోసం సినిమాలో రిపీట్ చేయడం వల్ల అది సినిమా కి మైనస్ పాయింట్ గా నిలిచింది. ఒక సీన్ లో నితిన్ గేస్ తో కలిసి డాన్స్ చేసారు అది ప్రేక్షకులను నవ్వించలేదు సరి కదా ఇంకా వెగటు పుట్టించేలా ఉంది. నితిన్ ఇలాంటి తప్పు ఇంక తరువాత వచ్చే సినిమాలలో చేయకుండా ఉంటే బావుంటుంది, లేదంటే తను మళ్ళీ గత అనుభవాన్ని రుచి చూడాల్సి వస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ