Advertisementt

షమితాబ్ లో.. అమితాబ్ టెర్రిఫిక్ లుక్!

Fri 26th Dec 2014 06:11 AM
shamitabh,amitabh bacchan,bollywood megastar,terrific look,twitter,kamal haasan daughter akshara,mobile cameras,r.baalky  షమితాబ్ లో.. అమితాబ్ టెర్రిఫిక్ లుక్!
షమితాబ్ లో.. అమితాబ్ టెర్రిఫిక్ లుక్!
Advertisement
Ads by CJ

తన కొత్త చిత్రం 'షమితాబ్' ఫస్ట్ లుక్ ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ విడుదల చేసి సంచలనం క్రియేట్ చేసాడు. ఈ లుక్ చూసిన వారంతా టెర్రిఫిక్ గా ఉందని ముక్తకంటం తో అంటున్నారు. ఈ సినిమాలో అడ్డదిడ్డంగా పెరిగిన జుట్టు , గెడ్డంతో అమితాబ్ 71 ఏళ్ళ వయసులో కూడా చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఫోటోగ్రాఫర్ల కంటపడకుండా ఈ సినిమా గెటప్ ను ఎక్కువ కాలం దాచి ఉంచడం చాలా కష్టమనీ , అందుకే తాను విడుదల చేస్తున్నానని అమితాబ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సినిమా తో కమలహాసన్ చిన్న కూతురు అక్షర కూడా బాలీవుడ్ తెరంగేట్రం  చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వందలాది మొబైల్ కెమెరాలు తన చుట్టూ ఉంటాయని, అలాంటప్పుడు వాటి నుండి ఈ గెటప్ ను కాపాడటం చాలా కష్టమని అమితాబ్ తన బ్లాగులో కూడా రాశాడు. 'షమితాబ్' సినిమాకు ఆర్.బాల్కీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ