Advertisementt

అఖిల్ కోసం హీరోయిన్ ని సెట్ చేశారు..!

Fri 26th Dec 2014 05:51 AM
akhil,amya dastru,akhil new movie  అఖిల్ కోసం హీరోయిన్ ని సెట్ చేశారు..!
అఖిల్ కోసం హీరోయిన్ ని సెట్ చేశారు..!
Advertisement
Ads by CJ

అక్కినేని నటవారసుడు , అక్కినేని నాగార్జున చిన్ని కుమారుడు అఖిల్ తొలి చిత్రం ఇటీవలే వినాయక్ దర్శకత్వంలో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. మొదట్లో శ్రీదేవి కూతురు జాహ్నవి, అలియాభట్ , కమల్ చిన్న కూతురు అక్షర , రాశిఖన్నా వంటి పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే హీరోయిన్ గా బాగా క్రేజ్ వచ్చే వారిని కాకుండా ఎలాంటి అంచనాలు లేని వారిని తీసుకుంటే మంచిదని భావించారు. లేకపోతే అనవసరమైన హైప్ క్రియేట్ అవుతుందని భావించారు . దీంతో యూనిట్ సైలంట్ గా తన పని తాను చేసుకుపోతోంది. ఇందులో భాగంగా రెండు హిందీ చిత్రాలు , ఒక తమిళ చిత్రంలో నటిస్తున్న అనుభవం ఉన్న ముంబై మోడల్ కమ్ హీరోయిన్ అమేరా దస్తూర్ ను అఖిల్ సరసన సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ అమ్మాయి అఖిల్ కంటే వయసులో పెద్దది.. అఖిల్ 1994 లో జన్మిస్తే.. అమేరా మాత్రం 1993 లోనే జన్మించింది. అయిన కూడా చూడటానికి అఖిల్ కంటే చిన్నగా , మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా ఉంటుందనే చెపాలి. మరి ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తున్నప్పటికీ అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో వేచిచుడాల్సివుంది..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ