నిన్నటి వరకు టాలీవుడ్ ని ఏలిన సమంతా , శ్రుతిహాసన్ , తమన్నా , కాజల్ మీద మన హీరోలకు ఆసక్తి తగ్గింది . దాంతో వారు తమ చిత్రాల్లో కొత్త హీరోయిన్లతో కలిసి నటించడానికి , కొత్త అందాలను తెరపైన చూపించడానికి సిద్దమవుతున్నారు. నిన్నటివరకు ఆ నలుగురు హీరోయిన్ల చుట్టూ తిరిగిన మన హీరోలు కొత్త అందాలపై ఆసక్తి చూపిస్తుండడంతో దర్శక నిర్మాతలు కూడా కొత్త వారి వేటలో తలమునకలై ఉన్నారు. పవన్ కళ్యాన్ తన 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి అనీషా ఆంబ్రోస్ ను సెట్ చేసుకున్నాడు. నాగార్జున తన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంలో నటించేందుకు లావణ్య త్రిపాఠి వైపు మొగ్గు చూపించాడు. రామ్ చరణ్- శ్రీనువైట్ల కాంబినేషన్ ల్ లో రూపొందనున్న చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ల వేట కొనసాగుతోంది. ఈ చిత్రం లో సోనాక్షిసిన్హా నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్-సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో కూడా కొత్త హీరోయిన్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు . ఇలా మన హీరోలు హీరోయిన్ల ఇంటికి దారేది అంటూ వేట మొదలుపెట్టారు.