>'గబ్బర్ సింగ్ 2' ను ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ.. ఈ చిత్రం అనుకున్నప్పటి నుండి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట్లో ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు అనుకున్నారు. ఆ తర్వాత పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయాడు. ఇటీవల దర్శకుడు మారాడని , దీనికి బాబి దర్శకత్వం వహిస్తాడని అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ ను కూడా ఫిక్స్ చేసారు. రెండో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ అని కూడా వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇదే నెలలో మొదలవుతుందని అన్నారు. కాని ఈ చిత్రం ఇప్పటివరకు మొదలు కాలేదు. 'గోపాల గోపాల' ఫినిషింగ్ స్టేజీ కి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రం పై ఇంకా క్లారిటీ రాలేదు. జనవరి లో మొదలవుతుందని అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్ 2' చిత్రం వచ్చే నెలలో కూడా ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఈ చిత్రం స్క్రిప్ట్ విషయంలో అనేక పరిణామాలు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయట. ఇప్పటికే పవన్ స్థాపించిన 'జనసేన' పార్టీ కి ఇటీవలే ఎన్నికల సంఘం నుండి గుర్తింపు వచ్చింది . రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ తన సత్తాచాటడానికి రెడీ అవుతున్నాడట. వీటన్నింటి వల్ల ఈ చిత్రం లేటవుతూ వస్తోందని , ఎప్పటి నుండి ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.