రాజమౌళిది పక్కా బిజినెస్ మైండ్. తన సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. 'బాహుబలి' కోసం ఆయన వేసిన ఎత్తుగడలన్నీ మంచి ఫలితాలను ఇచ్చాయి. ఆ సినిమా 500కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఇప్పుడు 'బాహుబలి' పేరుతో మరింత సొమ్ము రాబట్టాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. 'బాహుబలి టాయ్స్' అంటూ కొత్త వ్యాపారం చేయబోతున్నాడు. బాహుబలి, భళ్లాలదేవ, శివుడు, దేవసేన, అవంతిక, కట్టప్ప పాత్రలను పోలిన బొమ్మల్ని తయారుచేసి మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాడు. ఈ బొమ్మల వ్యాపారంతో కనీసం 20కోట్లు వెనకేయాలని స్కెచ్ వేస్తున్నాడు. 'బాహుబలి పార్ట్ 2' వచ్చే లోపు ఆ పాత్రల్ని మర్చిపోకుండా గుర్తు చేసుకునేందుకు , పిల్లలకు మరింత దగ్గరవ్వడానికి ఇదే మంచి మార్గమని జక్కన ప్లాన్ చేస్తున్నాడు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అని దీన్ని బట్టి చెప్పేయవచ్చు. అప్పట్లో పవన్‌కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్‌తో 'బాలు' డ్రస్సులు ఎలా మార్కెట్‌లోకి వచ్చాయో.. ఇప్పుడు ' బాహుబలి' పేరుతో బొమ్మలు రాబోతున్నాయి. బిజినెస్ మైండ్ అంటే అదే మరి....!