Advertisementt

అనుష్కపై విమర్శలు..!

Wed 31st Dec 2014 05:19 AM
anushka,tollywood,performance,glamour,image,beauty,mahesh babu,prabhaa,nagarjuna,young hero,bala krishna,venkatesh,rudhrama devi,bahubali,linga,rajanikanth,enthavadu gaani,ajith  అనుష్కపై విమర్శలు..!
అనుష్కపై విమర్శలు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా విజయశాంతి తరువాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ అనుష్క అటు మహేష్ బాబు, ప్రభాస్ వంటి యంగ్ హీరోల సరసన మరోపక్క నాగార్జున, బాలకృష్ణ , వెంకటేష్ వంటి సీనియర్స్ సరసన నటించి మెప్పించిన ఈ యోగా టీచర్ తాజాగా సినీ విమర్శకుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. 'రుద్రమదేవి, బాహుబలి' వంటి చిత్రాల్లో హీరోలకు ధీటైన పాత్రలు పోషిస్తున్న ఈ అమ్మడుకు 'లింగ' చిత్రంతో విమర్శల జడివాన మొదలైందని చెప్పవచ్చు. తన కెరీర్ చరమాంకంలో ఉన్న ఈ బ్యూటీ కెరీర్ 'మూడు పువ్వులు.. ఆరుకాయలు'గా సాగుతున్న తరుణంలో ఆమె మరీ బొద్దుగా తయారై, వెయిట్ పెరిగి హీరోలకంటే వయసు పెద్దదిగా కనిపిస్తోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. 'లింగ' చిత్రంలో 60 ఏళ్ళ రజనీకాంత్ సరసన కూడా ఈ అమ్మడు మరీ ఏజ్డ్ గా కనిపించిందనే విమర్శలు మూటగట్టుకోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఆమె గౌతమ్ మీనన్ చిత్రంలో అజిత్ వంటి సీనియర్ హీరో సరసన కూడా వయసు మీద పడినట్లు కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'ఎంతవాడు గానీ' చిత్రంలో ఆమె 50 కి దగ్గరలో ఉన్న అజిత్ కంటే వయసులో పెద్దదిగా కనిపిస్తోందని ఇటీవల విడుదలైన పోస్టర్స్ చూసిన సినీజనం విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఆమె దీనికి విరుగుడిగా కసరత్తులు ముమ్మరం చేసిందని, తనకి బాగా తెలిసిన యోగా ద్వారా మరలా మునుపటి గ్లామర్ ను సొంతం చేసుకోవడానికి సంసిద్ధురాలైందని అంటున్నారు. మరి ఆమె తెలుగులో యంగ్ హీరోలైన ప్రభాస్, రానాలా సరసన ఏవిధంగా కనిపించనుందనే విషయంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ