యాక్షన్ సినిమాల తర్వాత నాని ఎమోషనల్ టర్న్
Rukmini Vasanth to Star Opposite Nani in Prem Kumar Film
నేచురల్ స్టార్ నాని తన జోరును కొనసాగిస్తూ వరుసగా వైవిధ్యమైన ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `బ్లడీ రోమియో` చిత్రంతో బిజీగా ఉన్న నాని అనంతరం చేయబోయే ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన `96`, `మెయ్జగన్` వంటి క్లాసిక్ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్‌తో నాని త్వరలో జతకట్టబోతున్నట్లు సమాచారం.
ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ వివరాలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో నాని సరసన టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ప్రేమ్ కుమార్ టేకింగ్, సున్నితమైన భావోద్వేగాలు, ప్రేమకథలను తెరకెక్కించే విధానానికి నాని పర్ఫెక్ట్ ఫిట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం నాని నటిస్తోన్న సినిమాలన్నీ యాక్షన్ జోనర్‌కు చెందినవే కావడం గమనార్హం. ఇటీవలే రిలీజ్ అయిన `ది ప్యారడైజ్` భారీ యాక్షన్ నేపథ్యంలోనే వచ్చింది. రాబోయే `బ్లడీ రోమియో`లో నాని మాఫియా నేపథ్యంలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇలా వరుసగా హార్డ్-కోర్ యాక్షన్ చిత్రాలు చేస్తున్న నాని ఆ తర్వాత ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో స్వచ్ఛమైన, ఎమోషనల్ లవ్ స్టాండ్-అలోన్ సినిమా చేయడం ఇంట్రెస్టింగ్.
















































