ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> BB10: Shalini Loses Her Cool at Neethu

BB10: నీతూపై రెచ్చిపోయిన షాలిని

BB10: Shalini Loses Her Cool at NeethuBB10: Shalini Loses Her Cool at Neethu


బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఐదో వారం తర్వాత ఎంటర్ అయిన వైల్డ్ కార్డు లు ఐదుగురు హౌస్ లో ఇప్పటికే ఉన్న అగ్నిపరీక్ష టీమ్ కి తాట తీసి వదిలిపెట్టారు. రోహిత్, షాలిని ఇద్దరిని వారి చేసిన తప్పులు ఎత్తి చూపుతూ టార్గెట్ చేసారు. ఎక్కడా షాలిని తన తప్పులను ఒప్పుకోకుండా డిపెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ నీతూ లాంటి వాళ్ళు షాలిని కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు.

మీరు స్టేజ్ పై నించుని మాట్లాడడం కాదు హౌస్ లోకి వచ్చి టాస్క్ ఆడి గెలిచి చూపించమంది. నీతూ రాగానే స్ట్రాంగ్ ప్లేయర్ త్రిగున్ ని ఛాలెంజ్ చేసి టాస్క్ గెలిచి అతని పవర్ లాగేసుకుంది. అయినప్పటికీ శాలినిలో మార్పు లేదు, కావాలనే అగ్నిపరీక్ష టీమ్ తమను టార్గెట్ చేస్తుంది అంటూ షాలిని, రోహిత్ మాట్లాడుకుంటున్నారు.

షాలిని-రోహిత్ రూమ్ లో కూర్చుని ఉండగా నీతూ వచ్చి మాట్లాడుతుంది. శివ్, నీతూ ఇద్దరూ రోహిత్ తో మాట్లాడుతుండగా వారితో షాలిని గొడవ పెట్టుకుంటుంది. ఆ సోఫా వంగిపోతుంది, ఇరిగిపోతుంది అని వెటకారంగా నీతూ మాట్లాడుతుంది అంటూ షాలిని రెచ్చిపోయి నీతూని నాది, రోహిత్ బాండింగ్ ఏమిటో మాకు తెలుసు అంటూ అరవడం మొదలు పెట్టింది.

నేను రోహిత్ ని క్వచ్చన్ చేస్తే నీకేంటి, నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అని నీతూ చెప్పినా షాలిని వినలేదు, రామ్ ప్రసాద్ అరిచినా షాలిని, నీతూ గొడవ ఆగలేదు.

ఆతర్వాత నీతూ త్రిగున్ వాళ్లతో కూర్చుని ఈ గొడవపై డిస్కర్స్ చెయ్యగా.. శివ వచ్చి రోహిత్, షాలిని లతో మేము పరిచయం చేసుకోడానికి ఇలా అని అంటే మాకు మీతో కలవడానికి రెండు రోజులు పడుతుంది అంటూ షాలిని శివ ని కూడా పంపించేసింది. 

BB10: Shalini Gets Angry With Neethu