ఈ ఫ్యాన్ వార్ ఎక్కడికి దారి తీస్తుందో?
Fan wars Between TDP and Janasena
ప్రస్తుతం సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. స్థానిక సంస్థల నేపథ్యంలో సీట్ల గొడవ, అలాగే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈగోలకు పోతున్నారు. అందులోను మిత్ర పక్షంలో ఉన్న జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు ఎవ్వరూ రోడ్ మీదకి రానప్పుడు మా జనసైనికులే రోడ్లపైకి వచ్చారు అంటూ మట్లాడడం టీడీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
మరోపక్క వైసీపీ వాళ్ళు వేసే సెటైర్స్ ని టీడీపీ అభిమానులు, జనసైనికులు తీసుకోలేకపోతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే పవన్ కళ్యాణ్ రోడ్డుమీద పడుకున్నారు, ఆతర్వాత జనసైనికులు ఇక మాకే ఛాన్స్ అంటూ చంద్రబాబు అరెస్టు వేళ పండగ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ధర్నా చేస్తుంటే పోలీసులు ఆపారనే జనసైనికులు రోడ్లపైకి వచ్చింది అంటూ చేస్తున్న కామెంట్లకు అటు టీడీపీ ఇటు జనసేన మధ్యలో ఎంతగా ఆగడం ఏర్పడిందో స్పష్టమవుతుంది.
మరోపక్క టీడీపీ అభిమానులు పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పీచ్ ఇచ్చినా 15 ఏళ్లు కూటమి అంటూనే, మిత్రపక్షాన్ని ఇబ్బందిపెట్టే వ్యాఖ్యలెందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో, స్థానిక సంస్థల ఎన్నికల వలన కూటమి ప్రభుత్వంలో ఎలాంటి చీలికలు వస్తాయో అనే చర్చ మొదలయ్యింది.
















































