ఇండియన్ 3 అంటేనే ఇష్టం: కమల్ హాసన్
Kamal Haasan clarifies he likes Indian 3
ఇండియన్ 2 భారీ డిజాస్టర్ తర్వాత దానికి సీక్వెల్ గా తెరకెక్కాల్సిన ఇండియన్ 3 చిత్రం పై ఆడియన్స్ లో హోప్స్ లేకుండా పోయాయి. అంతేకాదు ఈ చిత్రం ఆగిపోయింది అని అనుకుంటున్న సమయంలో సడన్ గా ఇండియన్ 3 ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు. తాజాగా ఇండియన్ 3 షూటింగ్ ఓ పదిరోజుల్లో మొదలు కాబోతుంది అనే అప్ డేట్ అందించారు.
ఇప్పటికే చాలావరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఇండియన్ 3 ఇకపై మిగతా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది అంటూ అప్ డేట్ రివీల్ చేసారు. తాజాగా కమల్ హాసన్ ఇండియన్ 3 పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నారు. నాకు ఇండియన్ 3 అంటే చాలా ఇష్టం. కొందరు నేను భారతీయుడు ఫస్ట్ పార్ట్ ను ఇష్టపడతానని చెబుతారు, మరికొందరు సెకండ్ పార్ట్ ను ఇష్టపడతానని చెబుతారు. కానీ నాకు ఇష్టమైనది మాత్రం ఇండియన్ 3.. అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఇక ఇండియన్ వార్ మోడ్ చిత్రాన్ని 2027 సంక్రాంతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇండియన్ 3 ప్రీక్వెల్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో సేనాపతి మరోసారి తిరిగి రావడం ప్రధానంగా ఉండనుంది. ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
















































