అఖిల్ నెక్స్ట్ ఏంటి..!

What’s Next in Akhil’s Career?What’s Next in Akhil’s Career?


స్టూడెంట్స్ బీటెక్ లేదా డిగ్రీ, లేదంటే MBA ఇలా చదువు పూర్తి చెయ్యగానే నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా అఖిల్ అక్కినేని లెనిన్ హిట్ తర్వాత నెక్స్ట్ మూవీ ఏంటి అంటూ అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎపుడో జులై లో విడుదలైన లెనిన్ చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది, ఆ వెంటనే బుల్లితెర పై కూడా సందడి చేసింది.

ఇక ఈసారి అస్సలు బ్రేక్ తీసుకోనని అభిమానులకి మాటిచ్చిన అఖిల్ నెక్స్ట్ పై మాత్రం తేల్చడం లేదు. లెనిన్ తర్వాత నెక్స్ట్ మూవీ ని అఖిల్ ఏ డైరెక్టర్ తో చేస్తాడు, ఎప్పుడు మొదలు పెడతాడని క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అఖిల్ నుంచి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులైతే వెయిటింగ్.

ఇక అభిమానులు కూడా అఖిల్ లెనిన్ హిట్ ని కంటిన్యూ చెయ్యాలని, ఆచితూచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఫైనల్ చెయ్యాలని, బెస్ట్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలని, ఏదైనా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని అఖిల్ మొదలు పెట్టాలని వారు మాత్రం బలంగా కోరుకుంటున్నారు. మరి అఖిల్ నెక్స్ట్ ఏమిటో, దాని కోసం ఎన్ని రోజులు వెయిట్ జస్ట్ వెయిట్ అండ్ సి.

What’s Next for Akhil?