ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> The Paradise Faces A Chaotic 10-Day Countdown

ప్యారడైజ్ : అంతా హరిబరీనే

The Paradise Faces A Chaotic 10-Day CountdownThe Paradise Faces A Chaotic 10-Day Countdown


హీరో నాని లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈచిత్రం విడుదలకు జస్ట్ 10 డేస్ మాత్రమే సమయం ఉంది. సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లానింగ్ లేదు. ట్రైలర్ ఇవ్వలేమని చెప్పేసారు. సెన్సార్ టెన్షన్, సినిమా విడుదలయ్యే లాస్ట్ మినిట్ వరకు మేకర్స్ కి హరీబరి తప్పేలా లేదు.

హీరో నాని తన వంతుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారేమో చూడాలి. మరోపక్క దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కి నిద్రలేని రాత్రులు. ఓవర్సీస్ ప్రింట్స్ వెళ్లవరకు కంగారు. మరి రిలీజ్ డేట్ ఇచ్చాక లాస్ట్ మినిట్ లో ఇలాంటి హడావిడి, కంగారు తప్పదు. ఓ వారం పోస్ట్ పోన్ అంటే ఓటీటీ కోత , అలా చెయ్యలేని పరిస్థితి.

అందుకే ప్యారడైజ్ టీమ్ మొత్తం పగలు, రాత్రి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు శ్రమిస్తోంది. మధ్యలో సోషల్ మీడియా ఊహాగానాలు కొట్టెయ్యడానికి రిలీజ్ డేట్ పోస్టర్స్ వదులుతూ అలెర్ట్ చేస్తున్నారు. నిజంగా ప్యారడైజ్ విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఆడియన్స్ కి ఎలా ఉన్నా మేకర్స్ కి మాత్రం టెన్షనే. 


 

The Paradise Faces Last-Minute Release Pressure