ఇండస్ట్రీ హిట్ గా బెత్లెహెం కుటుంబ
Bethlehem Kudumbayogam Beats Lokah Chapter 2
మలయాళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా కొత్త లోక రూ.300 కోట్ల తో స్ట్రాంగ్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. దుల్కర్ నిర్మాతగా కళ్యాణి ప్రియదర్శి, తోవినో థామస్ ల కొత్త లోక మలయాళంలో బిగ్ హిట్ అవడమే కాకుండా ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు కొత్త లోక రికార్డ్ ను కొట్టి నివిన్ పౌలి-మమిత బైజుల బెత్లెహెం కుటుంబ యూనిట్ మలయాళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఆగష్టు 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెత్లెహెం కుటుంబ యూనిట్ థియేటర్స్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
మళయాలంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన బెత్లెహెం కుటుంబ యూనిట్ చిత్రం రూ.300 కోట్ల కలెక్షన్స్ తో మళయాళంలోనే బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాకపోతే తెలుగులో విడుదలైన ఈ చిత్రం ఇక్కడి ఆడియన్స్ ను అంతగా కట్టుకోలేకపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
















































