డిసెంబర్ 24: హాట్ ఫైట్
NBK111 Dada vs King 100: A New Box Office Clash
చిరు, బాలయ్య మద్యన బాక్సాఫీసు వార్ ఎంత మజా ఉంటుందో... కింగ్ నాగార్జున, నటసింహ బాలయ్య మద్యన వార్ అంతకుమించిన ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సంక్రాంతి సీజన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా.. పండగ సీజన్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వేరు. కానీ ఈసారి డిసెంబర్ 24 ఫైట్ మాత్రం హాట్ ఫైట్ అనే చెప్పాలి.
సినిమా ఇండస్ట్రీలో బాలయ్య కు నాగార్జున కు మధ్యన కోల్డ్ వార్ నడుస్తుంది. నాగర్జున ఉంటె బాలయ్య ఉండరు, బాలయ్య ఉంటె నాగార్జున ఉండరు. బాలయ్య ఎందుకో నాగ్ ని కలవడానికి ఇష్టపడరు. ఒకే స్టేజ్ పైకి రావడం నచ్చదు, అందుకే నాగార్జున బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ కి రాలేదు అంటారు.
అలాంటి కోల్డ్ వార్ హీరోల నడుమ బాక్సాఫీసు ఫైట్ లో ఉండే మజా మాములుగా ఉండదు. డిసెంబర్ 24 న #KING 100, బాలయ్య దాదా చిత్రాలు పోటీపడుతున్నాయి. ఇంచుమించు రెండు చిత్రాలు గ్యాంగ్ స్టర్ డ్రామాలే. అందులోను బాలయ్య-నాగ్ మద్యన పోటీ. అదే హాట్ ఫైట్.
సో ఈ డిసెంబర్ 24 న బాక్సాఫీసు దగ్గర జరగబోయే హాట్ ఫైట్ కోసం నందమూరి, అక్కినేని అభిమానుల కన్నా ఎక్కువగా కామన్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.















































