ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Dada Title Glimpse Gets Mixed Response

దాదా టైటిల్ గ్లింప్స్ పై మిక్స్డ్ రెస్పాన్స్

Dada Title Glimpse Gets Mixed ResponseDada Title Glimpse Gets Mixed Response

 

నందమూరి బాలకృష్ణ బర్త్ డే కి వదిలిన టీజర్ సినిమాపై భీభత్సమైన అంచనాలు క్రియేట్ చేసింది. బాలయ్య స్టయిల్, జెసిబి ఫైట్ కి అభిమానులే కాదు, మాస్ ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అయ్యారు. బాలయ్య లుక్స్ కి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి ఈ NBK 111 ప్రాజెక్ట్ పై హైప్ క్రియేట్ అయ్యింది.

కానీ నిన్న వదిలిన టైటిల్ గ్లింప్స్ పై మాత్రం మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. అంతేకాదు బాలయ్య దాదా టైటిల్ గ్లింప్స్ పై సోషల్ మీడియా ట్రోల్స్ చూసి నందమూరి అభిమానులు చాలా ఫీలవుతున్నారు. కొన్ని సినిమాల్లో హైలెట్ సీన్స్ రిఫరెన్స్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని దాదా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా అంటూ మాట్లాడుకుంటున్నారు.

బాలయ్య దాదా టైటిల్ గ్లింప్స్ తో బాగా అంచనాలు పెరగాలి కానీ, ఇలాంటి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడమేమిటి అని అభిమానులే ఆందోళన పడుతున్నారు. గోపీచంద్ మలినేని బాలయ్య దాదా ని ఏం చేస్తారో అంటూ వారు టెన్షన్ అపడుతున్నారు. మరి డిసెంబర్ 24 న దాదా పరిస్థితి ఏమిటో అనేది క్లారిటీ వస్తుంది. 

NBK111 Dada Title Glimpse Gets Mixed Response