పాన్ ఇండియా స్టార్స్ అలర్ట్ అవ్వాల్సిందే!

A Warning for Pan-India StarsA Warning for Pan-India Stars


పాన్ ఇండియా స్టార్స్ క్రేజీ ప్రాజెక్ట్స్ అంటూ టాప్ దర్శకులతో సినిమాలు మొదలు పెడుతున్నారు. హీరోల మర్కెట్ చూసి భారీ బడ్జెట్ పెడుతున్నారు. కానీ సినిమా షూటింగ్స్ సజావుగా సాగక ఏళ్ళ తరబడి ఆ చిత్రాలు సెట్ పైనే ఉంటున్నాయి. హీరోలు బరువు తగ్గడానికో, లేదంటే స్పెషల్ మేకోవర్ కోసమే ఇలా అనేక కారణాలతో సినిమాలు మొదలయ్యాక షూటింగ్స్ ఆగుతున్నాయి.

అదంతా ఒక ఎత్తైతే ఈమధ్యన స్టార్స్ సెట్ లో గాయపడి రెండు మూడు నెలలు రెస్ట్ లో ఉంటూ దర్శకులకు అందుబాటులో ఉండడం లేదు. ఈలోపు నిర్మాతలకు సినిమా బడ్జెట్ వడ్డీల రూపం లో పెను భారంగా మారుతుంది. మూడున్నరేళ్లుగా కన్నడ హీరో యశ్ ఒకే మూవీ పై ఉన్నారు. విపరీతమైన ఖర్చు పెట్టారు నిర్మాతలు.

కానీ ఈరోజు యశ్ నటించిన టాక్సిక్ రిజల్ట్ చూసాక అయినా పాన్ ఇండియా స్టార్స్ మేలుకోవాలి. పరిమితమైన బడ్జెట్, పర్ఫెక్ట్ డేట్స్, దర్శకులు అడిగినప్పుడు అందుబాటులో ఉండడం, దర్శకులు కూడా పూర్తి స్క్రిప్ట్ తో సినిమా సెట్ లోకి వెళ్లడం, ఇలా టాక్సిక్ లాగా కాస్ట్లీ తప్పిదాలు చెయ్యకుండా మేలుకోవాలి.

ఏళ్లతరబడి నిర్మాతలకు భారంగా మారకూడదు. షూటింగ్ మొదలై ఏడాది తిరిగేలోపు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటే సినిమా రిజల్ట్ తో పని లేకుండా నిర్మాతలు బయటపడతారు, లేదంటే... !
 

The Changing Game: Pan-India Stars Should Be Alert