Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Secret Behind Pan Indian films Success

పాన్-ఇండియా విజయాల వెనుక అసలు సూత్రం

Secret Behind Pan Indian films Success

 

నటీనటులకు ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని  భాష‌ల్లో  అవకాశాలు ల‌భిస్తున్నా? పని పట్ల చూపే నిబద్ధత .. క్రమశిక్షణ విషయంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ ఎంతో ప్రత్యేకమైనదని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సౌత్ లో  ఉండే నిర్మాణాత్మక వాతావరణం, సమయపాలన , కళాకారులకు లభించే పని స్వేచ్ఛ దక్షిణాదిని ఓ అద్భుతమైన వేదికగా మారుస్తున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం.

దక్షిణాది చిత్ర పరిశ్రమ అద్భుతమైన కథల ఎంపికలోనే కాదు. నైతిక విలువలు .. వృత్తిపరమైన నైపుణ్యంలోనూ అగ్రగామిగా నిలుస్తోంది. ఇక్కడి దర్శకుల దార్శనికత, సాంకేతిక నిపుణుల సృజనాత్మకత జాతీయ స్థాయిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నాయి. పని వేళలను గౌరవించడం, ప్రతిభకు సరైన గుర్తింపునివ్వడం .. మహిళా నటీమణులకు సురక్షితమైన, ఆత్మీయమైన వాతావరణాన్ని కల్పించడంలో ఇక్కడి సినీ వ్యవస్థ ఎంతో పరిణతి చెందింది.

ఈ విలువల వల్లే  పరిశ్రమ మరింత పటిష్టంగా ఎదుగుతోంది.  ఉత్తరాది నగరాల్లో పుట్టి పెరిగిన నటీనటులు సైతం తమ కెరీర్ ప్రయాణంలో దక్షిణాదిని ముఖ్యంగా టాలీవుడ్‌ను  సొంత ఇల్లుగా భావించడానికి ఇక్కడి ఆత్మీయతే ప్రధాన కారణం. బాలీవుడ్ వంటి పెద్ద పరిశ్రమలతో పోల్చినప్పుడు దక్షిణాది సినిమా ప్రపంచంలో కనిపించే నిరాడంబరత, క్రమశిక్షణ , కష్టపడే తత్వమే మంచి విజయాలకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి. పాన్-ఇండియా స్థాయిలో .. అంతర్జాతీయంగా నేడు దక్షిణాది సినిమాలు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఇక్కడి క్రమశిక్షణతో కూడిన వృత్తి నైపుణ్యానికి దక్కిన అసలైన గౌర‌వంగా చెప్పొచ్చు.
 

Pan Indian films Success Secret