భగీరథకు వంశీ ఎన్.టి.ఆర్ మహానంది గ్లోబల్ అవార్డు
Bhageeratha gets Vamsi NTR Mahanandi Global Award
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన 'మీర్జాపురంరాణి - కృష్ణవేణి' పుస్తకానికి వంశీ ఎన్.టి.ఆర్. మహానంది గ్లోబల్ అవార్డును ప్రదానం చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. హైదరాబాద్ లో శ్రీత్యాగరాయ గాన సభలో వంశీ సంస్థ ఎన్.టి.ఆర్. మహానంది గ్లోబల్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది.
బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొని జర్నలిస్ట్ భగీరథ, నిర్మాత ఎన్.ఆర్. కృష్ణవేణి ని సత్కరించి.. అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు 103వ జయతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్, రచయిత భగీరథ గారిని ఎంపిక చేసిన వంశీ రామరాజును అభినందించారు. రామారావు గారితో అనేక ఇంటర్వ్యూ లు చేసిన భగీరథ గారు, వారి శతాబ్ది సందర్భగా 'శకపురుషుడు', 'తారకరామం' అనే అద్భుతమైన పుస్తకాలు వెలువరించారని నరసింహారావు చెప్పారు. రామారావు గారిని మనదేశం సినిమాతో పరిచయం చేసిన శ్రీమతి కృష్ణవేణి గారి జీవిత చరిత్రను కూడా భగీరథ రాశారని, ఆ గ్రంధమే 'మీర్జాపురంరాణి -కృషవేణి' అని చెప్పారు.
కృష్ణవేణమ్మ కుమార్తె నిర్మాత అనురాధ గారిని ఎంపిక చెయ్యడం కూడా ఎంతో సముచితంగా ఉందని , ఈ సినిమాను ఎమ్. ఆర్. ఏ. అనే సంస్థ నిర్మించింది. ఎమ్. ఆర్. ఏ. అంటే మేకా రాజ్యలక్ష్మి అనురాధ. అలా రామారావు గారిని పరిచయం చెయ్యడంలో శ్రీమతి అనురాధాదేవి గారి పాత్ర కూడా ఉందని నరసింహారావు తెలిపారు.
వంశీ రామరాజు మాట్లాడుతూ.. భగీరథ గారితో ఐదు దశాబ్దాల నుంచి పరిచయం ఉంది, ఆయన జర్నలిజం, సాహిత్యంలో ఎంతో పేరు సంపాదించారని చెప్పారు.
భగీరథ మాట్లాడుతూ.. 1980 జూన్ 1వ తేదీన అశోక్ నగర్ గ్రంధాలయంలో నేను రచించిన 'మానవత' పుస్తకాన్ని మహాకవి శ్రీ శ్రీ గారు ఆవిష్కరించారు .అప్పటి నుంచి నా సాహిత్య ప్రస్థానం ప్రారంభమయ్యింది. ఇప్పటికి 19 పుస్తకాలు వ్రాశాను, 29 అవార్డులు వచ్చాయి, నంది, గద్దర్, నేషనల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డుల కమిటీల్లో పనిచేశానని చెప్పారు.
తాను వ్రాసిన 'నాగలాదేవి' పుస్తకాన్ని బళ్లారిలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో బిఎస్సీ విద్యార్థులకు పాఠ్య గ్రంథంగా ఉందని, తన సాహిత్య జీవితంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పరిశోధన జరుగుతుందని భగీరథ తెలిపారు.






































