ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun AA22 likely to follow two-part format

బ‌న్నీ తో అట్లీ ఒక‌టి కాదు రెండు భాగాలుగా

Allu Arjun AA22 likely to follow two-part formatAllu Arjun AA22 likely to follow two-part format

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 22వ చిత్రం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ కాన్సాస్ పై  తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అట్లీ నుంచి రాబోతున్న ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్ర‌మిది. ఈసారి అట్లీ టెక్నిక‌ల్ కాన్సెప్ట్ తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. `పుష్ప` తో పాన్ ఇండియాను షేక్ చేసిన బ‌న్నీ అట్లీ సినిమాతో పాన్ వ‌రల్డ్ కే క‌నెక్ట్ అయ్యే  క‌థాంశంతో వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. మొద‌టి భాగంగా ఏడాది ముగింపులో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఇందులో ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ఈ నేప‌థ్యంలో బ‌న్నీ వికీ నుంచి అందుతోన్న స‌మాచారం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఒకే భాగంగా క‌నిపించిన బ‌న్నీ 22వ చిత్రం రెండు పార్టులుగా రిలీజ్ చేస్తు న్న‌ట్లు అప్ డేట్ అయింది. ఈ అప్ డేట్ కంటే ముందే చిత్రం 2028లో  రిలీజ్ అవుతుంద‌ని షో అయ్యేది. కానీ ఇప్పుడా ఇయ‌ర్ ని తొల‌గించి రెండు పార్టులుగా అప్ డేట్ చేసారు.

అంటే?  మొద‌టి భాగం ఇదే ఏడాది  లేదా? వ‌చ్చే ఏడాది ఆరంభం రిలీజ్ ఉండొచ్చు అన్న‌ది ఓ అంచ‌నా. రెండ‌వ భాగం మాత్రం 2028లోనే రిలీజ్ అయ్యేలా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదీ ఏమైనా బ‌న్నీ సినిమా రెండు భాగాలుగా రావ‌డం అంటే అట్లీ బిజినెస్ స్ట్రాట‌జీ గ‌ట్టిగానే క‌నిపిస్తోంది.

పాన్ ఇండియాలో బ‌న్నీ క్రేజ్ మొద‌టి భాగం రిలీజ్ అనంత‌రం స‌క్సెస్ అయితే వ‌చ్చే క్రేజ్ తో రెండ వ భాగాన్ని మ‌రింత విస్తృతం చేసే అవ‌కాశం ఉంది.  ఇందులో బ‌న్నీ ద్విపాత్రాభినం, త్రిపాత్రాభినం చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కూడా న‌టిస్తున్నారు. 

AA22 Will be split into two parts

allu arjun aa22