ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Yash and Mad Max Stunt Director Guy Norris Shoot Massive Action Sequences for Ramayana

రామాయణ యాక్షన్ - యష్ vs రణబీర్

Yash and Mad Max Stunt Director Guy Norris Shoot Massive Action Sequences for Ramayana

బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రం పై ఎంతగా అంచనాలు ఉన్నాయో, అంతగా క్రేజ్ ఉంది. ఈ చిత్రం లో రాముడిగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లోకి సహా నిర్మాతగానే కాదు.. రావణ్ గా విలన్ కేరెక్టర్ లో పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ భారీ ప్రాజెక్టులో రావణుని పాత్రలో కనిపించబోతున్న యష్ హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌తో కలిసి యాక్షన్ సన్నివేశాలపై పని చేస్తున్నారు. గై నోరిస్‌ గతంలో మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్, ది సుసైడ్ స్క్వాడ్ వంటి హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన ఆయన రామాయణం కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. 

తాజాగా విడుదలైన సెట్స్ ఫోటోల్లో యాష్ ఒక శక్తివంతమైన, యుద్ధ సిద్ధంగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఆయన శారీరక రూపాంతరం రావణుని పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రామాయణం – పార్ట్ 1 దీపావళి 2026లో విడుదల కానుండగా, రెండవ భాగం దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Actor-Producer Yash and Mad Max Stunt Director Guy Norris Shoot Massive Action Sequences for Ramayana

ramayana