మాస్ జాతర రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
Mass Jathara Release Date FIxమాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాత. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మాస్ జాతర కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.
మాస్ జతర చిత్రం వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విధంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా మాస్ జాతర రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. ప్రచార చిత్రాలతోనే ఈ చిత్రం ఏ స్థాయి వినోదాన్ని అందించబోతుందో అర్థమైంది.
ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది
Raviteja Mass Jathara Release Date out







































