సెల్ ఫోన్ వచ్చాక పెద్దోళ్ళు, చిన్నోళ్లు అందరూ ఆ ఫోన్ కి బానిసలుగా మారిపోతున్నారు. పల్లెటూరి నుంచి పట్నం వరకు అందరి చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. ముసలోళ్ళు లేదు, చిన్న పిల్లలు లేదు అందరూ ఫోన్ కి ఎడిక్ట్ అయ్యారు, అవుతున్నారు. చేతిలో ఫోన్ లేకపోతే స్టేటస్ లేదు అని ఫీలైపోతున్నారు. అందులోను స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే తమ బానిస అన్న రీతిలో ఫీలవుతున్నారు.
ఈ ఫోన్ వల్ల ఎంత మంచి జరిగిందో తెలియదు కానీ ఫోన్ ప్రభావంతో ఎంతోమంది చెడిపోతున్నారు. ఫోన్ లో అడ్డమైన వీడియోస్ చూసి ఆపరేషన్లు చేసెయ్యడం, హత్యల కోసం యూట్యూబ్ ని వెతకడం, అదే ఫోన్ నుంచి మారణాయుధాలను ఆర్డర్ పెట్టడం దగ్గరనుంచి అన్ని ఆ సెల్ ఫోన్ నుంచే జరుగుతున్నాయి. ఫోన్ ట్రాన్సిక్షన్స్ తో సైబర్ నేరగాళ్ల విచ్చలవిడి అరాచకాలు జరుగుతున్నాయి. ఫోన్ ఉండాలి కానీ పరిమితి దాటకూడదు.
ఇప్పుడు వైజాగ్ లో ఒక విద్యార్థినిని ఫోన్ ఎందుకు కాలేజ్ కి తెచ్చావ్ అని ఆ విద్యార్థి చేతిలో ఉన్న ఫోన్ లెక్చరర్ తీసుకున్నారు అని, విచక్షణ మరిచిపోయి ఆ స్టూడెంట్ చెప్పుతో కొట్టడమే కాదు భూతులతో రెచ్చిపోయిన వీడియో చూసాక అందరూ విపరీతంగా షాకవుతున్నారు. ఆ సెల్ ఫోన్ లేకపోతే తన జీవితమే లేదు అన్నట్టుగా ఆ విద్యార్థిని లెక్చరర్ ని చెప్పుతో కొడుతూ బిహేవ్ చేసిన తీరు చూస్తే నిజంగా ఫోన్ వలన ఆ స్టూడెంట్ ఎంతగా చెడిపోయిందో అర్ధంమవుతుంది.