నిన్న చంద్రబాబు బర్త్ డే కానుక అయినా అనుకోవచ్చు లేదంటే నిరుద్యోగులకు పండుగ రోజు అయినా అనుకోవచ్చు, నిన్న ఏప్రిల్ 20 న ఏపీలో మెగా DSC నోటికికేషన్ వెలువడంతో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు, ఆఖరికి యాంటీ బ్లూ మీడియా కూడా చంద్రబాబు బర్త్ డే స్పెషల్ గా యువతకు కానుక అంటూ ప్రచురించడం గమనార్హం. గతంలో జగన్ సీఎం అవ్వకముందు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ హామీ ఇచ్చారు. కానీ సీఎం అయ్యాక డీఎస్సీ నోటిఫికేషన్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు కానీ చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం తో ఎంతోమందికి మంచి జరగడం ఖాయం.
చంద్రబాబు హయాంలో..
- ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ
- ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల్లో పోస్టింగులు
- 2014-2019 హయంలో 18 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ
- చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న హయాంలో 11 సార్లు డీఎస్సీ
- 11 సార్లు డీఎస్సీ ద్వారా 1,80,208 మందికి ఉపాధ్యాయ పోస్టులు
- ఇప్పుడున్న టీచర్లలో ఎక్కువమంది చంద్రబాబు హయాంలో పోస్ట్ లు పొందినవారే
జగన్ రెడ్డి హయాంలో..
- సీఎం కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ అని ఎన్నికల సయయంలో హామీ
- సీఎం అయ్యాక టీచర్ల భర్తీని అటకెక్కించేసిన జగన్ రెడ్డి
- జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ 5 ఏళ్ల పాటు విద్యార్థుల జీవితాలతో ఆటలు
- 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ
- నోటిఫికేషన్ రిలీజైన 30 రోజుల్లోనే పరీక్షలంటూ మెలిక
- 5 ఏళ్ల హయంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ విడుదల చేయని జగన్ రెడ్డి
- టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ కలిపి ఇచ్చి అభ్యర్థుల్లో అయోమయం సృష్టించాడు
- ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టించాడు
- అప్రెంటీస్ విధానం ద్వారా రెండేళ్ల పాటు ఉపాధ్యాయుల పొట్టకొట్టిన జగన్ రెడ్డి