Advertisementt

గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటి

Wed 16th Apr 2025 11:28 PM
gaddar film awards  గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటి
Gaddar Telangana Film Awards Jury Members గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటి
Advertisement
Ads by CJ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. మంగళవారం ఎఫ్ డి సి సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్ సినీనటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్ గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. 

ఈ సందర్భంగా ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరిలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నట్లు  తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదని చెప్పారు. 

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా. ఎస్. హరీష్ మాట్లాడుతూ సినీ నటి జయసుధ ఛైర్మన్ గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరిని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీ లకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్లు  ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21 వ తేదీ నుండి నామినేషన్ల  స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు.

ఈ గద్దర్ అవార్డు లకు గాను వివిధ క్యాటగిరిల ఎంట్రీ లకు గాను వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత క్యాటగిరి లో 1172,  ఫీచర్‌ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ, లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యురి తెలిపింది.

ఈ కమిటీని నిష్పక్షపాతంగా ఏర్పాటు చేసారు. అందులో ఇద్దరు సీనియర్ జర్నలిస్ట్ లను కమిటీలోకి ఎంపిక  చెయ్యడం అభినందించదగిన విషయం. అందులో ముఖ్యంగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సినిమా పరిశ్రమతో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మి నారాయణ ను ఎంపిక చెయ్యడం విశేషం. ఎన్నో సంవత్సరాలుగా వెబ్ మీడియాలో నిష్పక్షపాతంగా సినీ విమర్శకులుగా విశ్లేషణలు అందిస్తున్న అనుభవం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ జి వెంకటరమణ (జీవి)ని ఎంపిక చెయ్యడం అభినందించదగ్గ విషయం. అలాగే మిగతా మెంబెర్స్ అందరూ సినిమా పరిశ్రమతో మంచి అనుబంధం కలిగిన నిష్ణాతులైన వారు ఉండడం మంచి పరిణామం.. 

కమిటీ సభ్యుల వివరాలు: 

1. జయసుధ, నటి  - చైర్మన్

2. జీవిత రాజశేఖర్, నటి  - సభ్యురాలు 

3. శ్రీ కె. దశరథ్, దర్శకుడు - సభ్యుడు

4. B.V. నందిని రెడ్డి, డైరెక్టర్ - సభ్యురాలు 

5. శ్రీ ఇ. విజయ్ కుమార్ రావు, ఎగ్జిబిటర్ - సభ్యుడు

6. శ్రీ లక్ష్మీ నారాయణ, జర్నలిస్ట్ - సభ్యుడు

7. డా.ఎల్. శ్రీనాథ్, డైరెక్టర్ - సభ్యుడు

8. డా. ఔక్నూర్ గౌతమ్, ఫిల్మ్ అనలిస్ట్ - సభ్యుడు

9. శ్రీ కాసర్ల శ్యామ్, గీత రచయిత - సభ్యుడు

10. శ్రీ సి. ఉమా మహేశ్వర రావు, డైరెక్టర్ - సభ్యుడు

11. శ్రీ శివ నాగేశ్వరరావు, దర్శకుడు - సభ్యుడు

12. శ్రీ వి.ఎన్. ఆదిత్య, దర్శకుడు - సభ్యుడు

13. శ్రీ జి. వెంకట రమణ, జర్నలిస్ట్ - సభ్యుడు

14. శ్రీ ఏడిద రాజా, నిర్మాత - సభ్యుడు

15. MD, TGFDC, మెంబర్ - కన్వీనర్. 

Gaddar Telangana Film Awards Jury Members:

Government forms 15 member Gaddar Telangana Film Awards jury with Jayasudha as chairman

Tags:   GADDAR FILM AWARDS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ