యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎందుకు అంత కోపంగా కనిపిస్తారు, సినిమా సెట్ లో జోవియల్ గా ఉండే వ్యక్తి బయటికొచ్చేసరికి గంభీరంగా, కోపంగా ఉంటారు అనేది ఫ్యాన్స్ కంప్లైంట్. ఎక్కువగా సీరియస్ నెస్ ని మైంటైన్ చేసే ఎన్టీఆర్ నవ్వితే బావుంటారు, ఎప్పుడు నవ్వుతూ కనబడితే ఎన్టీఆర్ కి బావుంటుంది అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.
నిన్న శనివారం రాత్రి శిల్ప కళా వేదికలో జరిగిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈవెంట్ లో ఫ్యాన్స్ చేసిన రచ్చకి ఎన్టీఆర్ కి బాగా కోపమొచ్చేలా చేసింది. అసలే ఎన్టీఆర్ ఇలా కనబడి చాలా రోజులయ్యింది, అందుకే అభిమానుల ఆరాటం. విజయశాంతి మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తుంటే ఇలా అయితే నేను వెళ్ళిపోతాను అంటూ ఎన్టీఆర్ కోపంగా స్టేజ్ దిగబోయారు. కానీ కళ్యాణ్ రామ్, విజయశాంతి ఆయన్ని ఆపారు.
అయితే ప్రస్తుతం బరువు తగ్గి డల్ గా కనిపిస్తున్న ఎన్టీఆర్ ఆ కోపంలో లుక్ విషయంలో మళ్లీ విమర్శలకు తావివ్వడమే ఫ్యాన్స్ కు నచ్చలేదు. మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో కన్నా అర్జున్ సన్ ఆఫ్ విజయంతి ఈవెంట్ కొచ్చేసరికి ఎన్టీఆర్ మరింత బరువు తగ్గినట్టుగా కనిపించడంతో ఎన్టీఆర్ లుపై మరోసారి డిస్కర్షన్స్ మొదలయ్యాయి. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు.