లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) రివ్యూ
ఎస్పీ చరణ్...
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు!
తండ్రి బాటలో నడుస్తూ గాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు!
కొన్నేళ్ల క్రితం నటుడిగా కూడా ఎస్పీ చరణ్ ట్రై చేశారు. అయితే నటనకు గ్యాప్ వచ్చింది.
కొంత విరామం తర్వాత నటుడిగా ఎస్పీ చరణ్ రీఎంట్ ఇచ్చిన సినిమా లైఫ్ (లవ్ యువర్ ఫాదర్)
యమలీల వంటి హిట్ సినిమాలు ఎన్నో ప్రొడ్యూస్ చేసిన మనిషా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రమిది.
శ్రీ హర్ష హీరోగా పరిచయమైన ఈ సినిమాలో కషికా కపూర్ హీరోయిన్.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూడండి
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సబ్జెక్ట్:
యూత్ ఫుల్ కామెడీ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఆ కథలకు ఫాదర్, మదర్ సెంటిమెంట్ యాడ్ చేస్తూ వచ్చిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇటీవల డివోషనల్ టచ్ ఉన్న మైథాలజీ, ఫాంటసీ సినిమాలకు ఆడియన్స్ ఆదరణ దక్కుతోంది. ఆ పాయింట్ మీద లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రైటింగ్ టీం కాన్సెంట్రేట్ చేసింది. ఇందులో స్టార్స్ లేరు. కానీ కంటెంట్ మాత్రం ఉంది. కాన్సెప్ట్ బాగుంది.
అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గొడవలు వస్తున్న ఈ రోజుల్లో, బంధాలు బంధుత్వాలకు చెల్లు చీటీ పలుకుతూ సొంత మనుషులను సైతం పట్టించుకోని వేళల్లో... అనాథలకు అండగా నిలబడతాడు ఒక తండ్రి. అతనికో కొడుకు. ఈ జనరేషన్ అబ్బాయి. కాలేజీలో ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఆ ప్రేమ కథ రెగ్యులర్ సినిమాలలో చూసే విధంగానే ఉంటుంది. అయితే తండ్రిని బడా బిజినెస్ మాన్ టార్గెట్ చేస్తాడు. హార్స్ రైడింగ్, క్యాసినో వ్యాపారాలతో ప్రజలను దోచుకునే ఒక విలన్ వీళ్ళ మీద పడతాడు. తండ్రి పరువును బజారుకు ఏడ్చిన అతని మీద కొడుకు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది సినిమా కథ. మనం నలుగురికి సాయం చేస్తే ఆ భగవంతుడు మనకు సాయం చేస్తాడు అని పాయింట్ చెప్పిన కథ. కాలేజీలో కథ రొటీన్ అనిపించిన అఘోరాలు ఎంటర్ అయిన తర్వాత నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ అనే విధంగా ఉంటుంది.
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) రిపోర్ట్:
ప్రేమ కథ ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్టే ఉంటుంది. ఆ కాలేజీలో స్నేహితుల మధ్య సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. కానీ వాటితో ఫన్ జనరేట్ చేశారు. కామెడీ వర్కౌట్ అయ్యింది. అయితే కామెడీ కంటే ఎక్కువగా మైథాలజీ కనెక్షన్ కథపై క్యూరియాసిటీ జనరేట్ చేసింది. ఎస్పీ చరణ్ శ్రీ హర్ష మధ్య రిలేషన్ ఏమిటనేది ఆడియన్స్ అందరిలో పజిల్ కింద మారుస్తూ, అఘోరాలతో కథలో సస్పెన్స్ పెంచారు దర్శకుడు. ఈ క్రమంలో అనవసరమైన కొన్ని కామెడీ సీన్లతో నిలిపి పెంచుతూ వెళ్లినా చివరకు వచ్చేసరికి ఒక డివోషనల్ ఫీలింగ్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా చివరి అరగంటలో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్ సినిమాకు బలంగా నిలిచాయి.
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) ఎఫర్ట్:
గాయకుడిగా తన బలం చాటుకున్న ఎస్పీ చరణ్ ఈ సినిమాతో ఉన్నటుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ జనరేషన్ ఫాదర్ రోల్ చక్కగా చేశాడు. ఒక పాటలో ఆయన వేసిన స్టెప్పులు ప్రేమికుడు సినిమాలో ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని గుర్తుకు తెస్తాయి. హీరోగా శ్రీ హర్ష క మొదటి సినిమా అయినా సరే చక్కటి నటన కనపరిచాడు. హీరోయిన్ కషిక పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. పాటల్లో గ్లామర్ యాడ్ చేసింది. ప్రవీణ్, రఘుబాబు, షకలక శంకర్ కామెడీ పార్ట్ చూసుకున్నారు.
దర్శకుడు పవన్ కేతరాజు కాలేజీ సన్నివేశాలను రెగ్యులర్ సినిమా తరహాలో తీసిన డివోషనల్ సీన్స్ తీయడంలో పట్టు ప్రదర్శించాడు. మణిశర్మ చేసిన డివోషనల్ సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున సినిమా తీశారు.
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) రిజల్ట్:
సినిమా కాన్సెప్ట్ బావుంది. మైథాలజీ పాయింట్, ఎండింగ్ ట్విస్ట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. అయితే రిలీజ్ టైం రాంగ్ అని చెప్పాలి. ఎగ్జామ్స్ సీజన్ తర్వాత ఆడియన్స్ థియేటర్లకు తక్కువగా వస్తున్న టైంలో రిలీజ్ చేశారు. హీరో నటన, ఎస్పీ చరణ్ తండ్రి క్యారెక్టర్ మంచి మార్క్స్ వేయిస్తాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను తప్పకుండా మెప్పించే చిత్రమిది.
సినీ జోష్ పంచ్ లైన్: లవ్ యువర్ ఫాదర్... తండ్రి క్యారెక్టర్ ఇచ్చిన మెసేజ్ అందరికీ అవసరం.
రేటింగ్-2.5/5