Advertisementt

పెద్ది గ్లింప్స్-నవమి వరకు వెయిట్ చెయ్యాల్సిందే

Sun 30th Mar 2025 08:56 PM
peddi  పెద్ది గ్లింప్స్-నవమి వరకు వెయిట్ చెయ్యాల్సిందే
PEDDI First Shot On April 6th పెద్ది గ్లింప్స్-నవమి వరకు వెయిట్ చెయ్యాల్సిందే
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చి బాబు సానా, ఎఆర్ రెహమాన్, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పాన్ ఇండియా ఫిల్మ్ పెద్ది ఏప్రిల్ 6న శ్రీరామ నవమికి ఫస్ట్ షాట్ రిలీజ్ 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. జాతీయ అవార్డు గ్రహీత, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల చేసిన టైటిల్, రెండు అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లు గొప్ప ఇంపాక్ట్ ని క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

ఉగాది సందర్భంగా, మేకర్స్ బిగ్ అప్‌డేట్‌తో చ్చారు. ఈ చిత్రం యొక్క మొదటి షాట్‌ను శ్రీరామ నవమికి ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు. రామ్ చరణ్ జనసమూహం మధ్య గాలిలోకి దూకుతూ కనిపించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఇంటెన్స్ మూమెంట్ ని ప్రజెంట్ చేస్తోంది. ఫస్ట్ షాట్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుందని హామీ ఇస్తోంది.

రామ్ చరణ్ పెద్ది కోసం కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రగ్గడ్, రస్టిక్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు.  

ఈ చిత్రంలో జాన్వి కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.   

PEDDI First Shot On April 6th :

PEDDI First Shot On April 6th For Sri Rama Navami

Tags:   PEDDI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ