Advertisementt

వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ

Sat 29th Mar 2025 05:45 PM
modi  వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ
Modi participates in the What India Thinks Today Summit వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో పాల్గొన్న మోదీ
Advertisement
Ads by CJ

భారతదేశంలో అతిపెద్ద న్యూస్‌ నెట్‌వర్క్‌ టీవీ  నైన్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు  ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు.  ఈ సమ్మిట్ లో ప్రసంగించిన మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ జూపల్లి రాము రావు  కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగిన ఆర్థిక పురోగతి ప్రయత్నాల గురించి వివరించారు. ప్రపంచ బ్యాంకు, IMF డేటా ప్రకారం, రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని అన్నారు. పీఎం గతి శక్తి, స్టార్టప్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వంటి కార్యక్రమాలు.. తయారీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వంటి వాటిలో మార్పునకు దారితీస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో చూపిస్తున్న చొరవ.. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఆదర్శంగా మారుతోందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మన్ రాము రావు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం.. అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా దార్శనికత దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చిందని తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ఒక మార్గదర్శి పాత్రను పోషిస్తోందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో 1.45 బిలియన్ల భారతీయుల ఆకాంక్షలకు బలమైన దిశానిర్దేశం చేయడం, ప్రపంచ వృద్ధికి భారతదేశం ప్రధానంగా మారడం ద్వారా తాను ఎంతో ప్రేరణ పొందానని అన్నారు. భారతదేశ పురోగతిని ప్రపంచ బ్యాంకు, IMF కూడా అంగీకరిస్తున్నాయని ఆయన చెప్పారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచం దృష్టంతా నేడు భారత్‌పై ఉందని ప్రధాని  మోదీ అన్నారు.  ప్రపంచంలోని ప్రతీ దేశ పౌరుడు ఒక జిజ్ఞాసతో భారత్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ తన కీలక ఉపన్యాసంలో సమకాలీన రాజకీయాలతో పాటు అనేక జాతీయ అంతర్జాతీయ అంశాలను ప్రస్తావించారు.

భారత దేశం నేడు ఏం ఆలోచన చేస్తోందని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు.  వల్డ్ ఆర్డర్‌లో భారతదేశం కేవలం పాల్గొనడం మాత్రమే కాదు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో, పదిలపరచడంలోనూ తోడ్పాటు అందిస్తోందని తెలిపారు. గతాన్ని, వర్తమానాన్ని పోల్చుతూ అనేక అంశాలను  ప్రధాని ఉదహరించారు.

టీవీ నైన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  వాట్‌ ఇండియా థింక్స్ టుడే శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మైహోం గ్రూప్‌ ఛైర్మన్‌ రామేశ్వరరావు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికగా ఇద్దరూ ఆసీనులయ్యారు.

వాట్‌ ఇండియా థింక్స్ టుడే ఒక వినూత్నమైన, అద్భుతమైన కార్యక్రమం, ఇతర చానెళ్లు కూడా అనుకరించక తప్పదని అన్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న  టీవీనైన్‌ నెట్‌వర్క్‌కు  ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Modi participates in the What India Thinks Today Summit:

Prime Minister Shri Narendra Modi addresses TV9 Summit 2025

Tags:   MODI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ