Advertisementt

22 ఏళ్ల నటప్రస్థానంలో అల్లు అర్జున్‌

Fri 28th Mar 2025 05:46 PM
allu arjun  22 ఏళ్ల నటప్రస్థానంలో అల్లు అర్జున్‌
Allu Arjun Completes 22 Years in Indian Cinema 22 ఏళ్ల నటప్రస్థానంలో అల్లు అర్జున్‌
Advertisement
Ads by CJ

విసుగును వీడి..విజయం కోరి.. విరామం ఎరుగక పనిచేయలోయ్‌.. అసాధ్యమనేది అసలే లేదని, చరిత్ర నేర్పెను పవిత్ర పాఠం అన్న కవి మాటలు లక్ష్యం దిశగా పయనం సాగించే ప్రతి వ్యక్తి విషయంలో అక్షర సత్యాలు. విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆత్మవిశ్వాసంతో, సంకల్పంతో సాధించలేనిది ఏమీ లేదు అని నిరూపిస్తారు. 

సరిగ్గా పైన చెప్పిన విషయాలు ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ విషయంలో అక్షర సత్యాలు. ఈ రోజు ఆయనకు ఐకాన్‌స్టార్‌ అనే కిరీటం, ప్రపంచస్థాయి గుర్తింపు, ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు.. ఇవన్నీ రాత్రికి రాత్రే వరించలేదు.. దీని వెనుక 22 ఏళ్ల పట్టుదల, ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాలనే తపన అతన్ని కార్యోన్ముఖుడిని చేసింది. గంగోత్రి సమయంలో ఆయన ఓ సాధారణ హీరో.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపు, భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. 

పుష్ప-2- చిత్రంతో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పి విజయపథంలో దూసుకెళ్లిన ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ తొలచిత్రం గంగోత్రి విడుదలై నేటికి 22 ఏళ్లు... అంటే నటుడిగా ఐకాన్‌స్టార్‌ 22 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు...

గంగోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన  అల్లు అర్జున్‌, తనపై వచ్చిన విమర్శలను సవాల్‌గా తీసుకున్నాడు.. మలిచిత్రం ఆర్యలో తన మేకోవర్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఆ చిత్రంలో వన్‌సైడ్ లవర్‌ ఆర్యగా ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ చిత్రమే ఆయన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ నిలిచింది. 

ఇక సినిమా సినిమాకు ఇంతింతయు, నటుడింతయి అన్న చందాన తన స్టార్‌డమ్‌ను పెంచుకుంటూ ఎవరూ ఊహించని ఉన్నతస్థానంలో నిలిచాడు. ఈ రోజు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అంటే క్రేజీ పాన్ ఇండియా స్టార్‌, ఆయన డేట్స్‌ కోసం బాలీవుడ్‌లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు వెయిట్‌ చేస్తున్నారంటే ఆయన క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అల్లు అర్జున్‌ ఆర్య-2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్‌ సినిమాల మధ్యలో వేదం వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ సినిమాలో నటించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు. గోన గన్నారెడ్డి వంటి చరిత్ర యోధుడి పాత్రలో నటించి ఇలాంటి పాత్రలు కూడా తాను చేయగలనని నిరూపించుకున్నాడు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సారి సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూపించిన హీరోగా దేశ ముదురులో కనిపించి అందరిని సంభ్రమశ్చర్యాలకు గురిచేశాడు. అప్పట్లో ఆయన సిక్స్‌ ప్యాక్‌ హాట్‌టాపిక్‌గా మారింది. 

డీజే దువ్వాడ జగన్నాథం, బద్రీనాథ్‌  చిత్రల్లో  వైవిధ్యమైన పాత్రలో మెప్పించి అల్లు అర్జున్‌ ఏ సినిమా చేసిన ఆ పాత్రలోకి ఒదిగిపోయేవాడు. ఇద్దరమ్మయిలతో, నా పేరు సూర్య వంటి చిత్రాలతో మెప్పించిన ఈ ఐకాన్‌స్టార్‌ సరైనోడు, రేసుగుర్రం చిత్రాలతో కమర్షియల్‌ చిత్రాల పవర్‌ ఏమిటో నిరూపించాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటించిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన మొదటి రెండు చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించడమే కాకుండా, నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. 

అల వైకుంఠపురం చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల వారిని అలరించడమే కాకుండా వసూళ్లలో తెలుగు సినీమా చరిత్ర రికార్డును తిరగరాసింది. ఇక ఆర్య చిత్రంతో ఆయన కెరీర్‌ను టర్న్‌ చేసిన దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ను పుష్ప చిత్రంలో పుష్పరాజ్‌గా ఓ చరిత్రను తిరగరాసే పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో ఆయన నటించిన విధానంతో ఇండియా లెవల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్‌ అభిమానులు సంపాందించుకున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం దక్కించుకున్నాడు. 

ఇక ఇటీవల పుష్ప-2లో ఆయన  నటనకు ప్రపంచమంతా ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప-2 రికార్డులు సాధించింది. అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన సంగతి తెలిసింది. ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ అసామాన్య నటనా ప్రతిభకు త్వరలోనే మరిన్ని అవార్డులు కైవసం చేసుకుంటాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు..

Allu Arjun Completes 22 Years in Indian Cinema:

Icon Star Allu Arjun Completes 22 Years in Acting Career

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ