Advertisementt

జపాన్‌ ఫ్యాన్ అభిమానానికి ఎన్టీఆర్ ఫిదా

Thu 27th Mar 2025 05:44 PM
ntr  జపాన్‌ ఫ్యాన్ అభిమానానికి ఎన్టీఆర్ ఫిదా
NTR shares an incredible and heartwarming story of a Japanese fan learning Telugu జపాన్‌ ఫ్యాన్ అభిమానానికి ఎన్టీఆర్ ఫిదా
Advertisement
Ads by CJ

ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు.

ఈ క్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్ వద్దకు వచ్చి తెలుగులో మాట్లాడారు. జపాన్‌లో ఇలా తెలుగు మాట్లాడటం ఏంటి? అని ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. దీంతో ఆ ఎమోషనల్ వీడియోని పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఒక జపనీస్ అభిమాని తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారట. ఆ అభిమాని గురించి చెబుతూ ఎన్టీఆర్ ఓ పోస్ట్ వేశారు. సినిమా అనేది భాషా సరిహద్దుల్ని చెరిపేస్తుందని, అందరినీ ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టుగా చెప్పుకొచ్చారు.

నేను జపాన్‌కి వచ్చినప్పుడల్లా అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నమైన అనుభూతి కలిగింది. ఒక జపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విని నిజంగా నన్ను కదిలించింది. సంస్కృతుల మధ్య వారధిగా ఉండటానికి సినిమా అనేది ఓ శక్తిలా ఉంటుందని చాటి చెప్పారు. సినిమా, భాషల ప్రేమికుడిగా ఒక అభిమానిని భాష నేర్చుకోవడానికి ఆ సినిమా ప్రోత్సహించింది అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి వాటి కోసమే మన ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని ఎన్టీఆర్ అన్నారు.

NTR shares an incredible and heartwarming story of a Japanese fan learning Telugu:

NTR shares an incredible and heartwarming story of a Japanese fan learning Telugu after watching RRR

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ