Advertisementt

రేపే RC16 టైటిల్-ఫస్ట్ లుక్

Wed 26th Mar 2025 06:19 PM
ram charan  రేపే RC16 టైటిల్-ఫస్ట్ లుక్
Ram Charan Birthday Treat రేపే RC16 టైటిల్-ఫస్ట్ లుక్
Advertisement
Ads by CJ

గ్లోబల్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ ఎన్నడూ లేనివిధంగా మ్యాజిక్‌ను క్రియేట్ చేయటానికి మరోసారి తిరిగి వచ్చాడు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ చిత్రాన్ని రామ్ చరణ్ సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సానా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నారు. ఈ పాన్-ఇండియా సినిమాటిక్ వండర్‌ను పవర్‌హౌస్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పిస్తోంది.

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే అందరి అంచనాలకు తగ్గకుండా మేకర్లు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అప్డేట్ ఇవ్వబోతోన్నారు. అయితే అంత వరకు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రామ్ చరణ్ లుక్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు.

రా అండ్ రస్టిక్, రగ్డ్ లుక్‌లో రామ్ చరణ్ కనిపించబోతోన్నారు. చేతిలో చుట్ట, పొడవైన జుట్టు, గుబురు గడ్డం లుక్‌‌లో రేపు రామ్ చరణ్ దర్శనం ఇవ్వబోతోన్నారు. మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్‌ను ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలానే బుచ్చిబాబు చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది. మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్‌ను మరింత రగ్డ్ లుక్‌లో చూపించబోతోన్నారని ఈ ప్రీ లుక్ పోస్టర్‌ను చూస్తేనే అర్థం అవుతోంది. 

Ram Charan Birthday Treat:

RC16 title and first look as Ram Charan Birthday special tomorrow

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ