Advertisementt

విజయ్ చివరి చిత్రం రిలీజ్ డేట్

Mon 24th Mar 2025 07:38 PM
vijay  విజయ్ చివరి చిత్రం రిలీజ్ డేట్
Jana Nayagan locks January 9 2026 release విజయ్ చివరి చిత్రం రిలీజ్ డేట్
Advertisement
Ads by CJ

దళపతి విజయ్ చివరి సినిమా జన నాయగన్ జనవరి 9, 2026న విడుదల కాబోతోందని మేకర్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పేశారు. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించి మరింతగా హైప్ క్రియేట్ చేశారు.

దళపతి విజయ్ నటిస్తున్న ఈ జన నాయగన్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దించుతున్నారు. సంక్రాంతి సందడి మొదలయ్యే కంటే ముందే బాక్సాఫీస్ వద్ద విజయ్ సందడి షురూ కానుంది. కోలీవుడ్‌లో పొంగల్ అంటే విజయ్ సాధించిన రికార్డులు, వసూళ్ల వర్షం అందరికీ గుర్తుకు వస్తుంటుంది. ఇక చివరగా ఇలా సంక్రాంతి బరిలోకి విజయ్ వచ్చి రికార్డులు సునామీని సృష్టించబోతోన్నారని అందరికీ అర్థమై ఉంటుంది.

విజయ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. స్టైలీష్ లుక్‌లో విజయ్ తన ఫ్యాన్స్‌ను ఇట్టే కట్టిపడేశారు. ఫార్స్ ఫిల్మ్ ద్వారా ఓవర్సీస్‌లో ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇక విజయ్ నటించే చివరి చిత్రం అవ్వడంతో చెన్నై నుంచి చికాగో.. ముంబై నుంచి మెల్‌బోర్న్‌ వరకు అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Jana Nayagan locks January 9 2026 release:

Thalapathy Vijay Jana Nayagan locks January 9 2026 release

Tags:   VIJAY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ