Advertisementt

కన్నప్ప నుంచి రొమాంటిక్ సాంగ్

Mon 10th Mar 2025 05:59 PM
vishnu manchu  కన్నప్ప నుంచి రొమాంటిక్ సాంగ్
New Love Song from Kannappa కన్నప్ప నుంచి రొమాంటిక్ సాంగ్
Advertisement
Ads by CJ

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.

విష్ణు మంచు, ప్రీతి ముకుందన్ కనిపించే సగమై.. చెరిసగమై అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటను రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. స్టీఫెన్ దేవస్సీ బాణీ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి సాహిత్యం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సాంగ్ చిత్రీకరించిన తీరు, ఇక ప్రభు దేవా, బృందా కొరియోగ్రఫీ చేసిన విధానం, విష్ణు మంచు-ప్రీతి ముకుందన్‌ను చూపించిన తీరు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది.

New Love Song from Kannappa:

Vishnu Manchu and Preity Mukundhan magical love story comes alive in new Love Song- Song Out Now

Tags:   VISHNU MANCHU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ