రామ్ చరణ్- బుచ్చి బాబు కలయికలో RC 16 (వర్కింగ్ టైటిల్)ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే శివన్న షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉండే శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్నారు.
RC 16 షూటంగ్ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను ఫినిష్ చేసింది. ఈ చిత్రంలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ప్రస్తుతం శివరాజ్ కుమార్ లుక్ టెస్ట్ కి సంబందించిన వీడియోని మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేసారు.