ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన రీజనల్ ఇండస్ట్రీ హిట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం గురించి అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమా అనీల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు అందరి దృష్టి ఓటిటి విడుదలపై ఉన్నప్పటికీ జీ సంస్థ ముందుగా ఈ సినిమా బుల్లితెర టెలికాస్ట్ డేట్‌ను ప్రకటించి అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.
జీ తెలుగు ఛానెల్ వారు ఈ చిత్రాన్ని త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫైనల్‌గా టెలికాస్ట్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం కానుందని వారు అధికారికంగా ప్రకటించారు.
థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం బుల్లితెరపై కూడా అదే స్థాయిలో సక్సెస్ సాధిస్తుందా టీఆర్పీ రేటింగ్స్‌లో కొత్త రికార్డులను నమోదు చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ హిట్ మూవీని మరోసారి ఆస్వాదించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.