ఈరోజు ఉదయం చిత్తజల్లు కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 101 సంవత్సరాలు. నందమూరి తారక రామారావు గారిని మనదేశం సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు.
నిర్మాత మరియు నేపథ్య గాయని. కృష్ణవేణి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పంగిడి లో జననం 24 డిసెంబరు 1924 జన్మిచారు. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆమె డ్రామా ఆర్టిస్ట్. అనసూయ (1936) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అరంగేట్రం చేసింది. ఆమె తండ్రి కృష్ణారావు వైద్యుడు. ఆమెకు తెలుగు సినిమాలలో నటించడానికి అనేక ఆఫర్లు రావడంతో 1939 లో చెన్నైకి మకాం మార్చింది. తమిళం వంటి ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించింది.
ఈమె 1939లో మీర్జాపురం జమీందారును వివాహమాడింది. చెన్నైలోని తన భర్తకు చెందిన శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్, ఫిల్మ్ మేకింగ్లో క్రియాశీలకంగా మారారు.
ఆమె మన దేశం (1949) తెలుగు చిత్రం ద్వారా నిర్మాతగా అనేక మంది ప్రముఖ సినీ ప్రముఖులను పరిచయం చేశారు. వీరిలో నటుడిగా ఎన్.టి.రామారావు, సంగీత దర్శకుడిగా ఘంటసాల వెంకటేశ్వరరావు, నేపథ్య గాయనిగా పి.లీల తదితరులు నటించారు.