కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా దిల్ రూబా అసలైతే ఈ రోజు ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే రోజున విడుదల కావాల్సి ఉంది. అనివార్య కారణాల వలన దిల్ రుబా పోస్ట్ పోనే అయ్యి కొత్త డేట్ లాక్ చేసారు మేకర్స్. మార్చి 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రూబా చిత్రాన్ని విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కు రావాల్సిన దిల్ రూబా సినిమా బెటర్ ఔట్ పుట్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది. మార్చి 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ప్రమోషనల్ కంటెంట్ తో దిల్ రూబా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. క మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం మంచి ఫామ్ లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో దిల్ రూబా సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.