Advertisementt

దారుణం-RTC బస్సు లో తండేల్ పైరసీ

Mon 10th Feb 2025 08:35 PM
thandel  దారుణం-RTC బస్సు లో తండేల్ పైరసీ
Atrocity- Thandel piracy in RTC bus దారుణం-RTC బస్సు లో తండేల్ పైరసీ
Advertisement
Ads by CJ

రెండురోజుల క్రితం విడుదలైన తండేల్ చిత్రాన్ని పైరసీ భూతం వెంటాడుతోంది. తండేల్ చిత్రాన్ని APSRTC బస్సు లో పైరసీ కాపీ ని ప్లే చేయడంపై నిర్మాత బన్నీవాస్ ఫైర్ అయ్యారు. తెలుగులో ఎప్పుడూ లేని కల్చర్‌ గత రెండు నెలల కనపడుతోంది. ఈ సినిమా మా అందరి కష్టం. రెండేళ్లు ఎంతో శ్రమించాం. సినిమా బ్లాక్ బస్టర్ సాధించి మేము ఎంజాయ్ చేసే సమయంలో ఇలా జరిగింది. సోమవారం నుంచి టికెట్‌ రేట్లు తగ్గించాలని అల్లు అరవింద్‌ సూచించారు. అందుకు తగినట్లుగానే చాలా థియేటర్స్‌లో టికెట్‌ ధరలు తగ్గించాం. 

మా బాధేంటంటే కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు. క్రిమినల్‌ కేసు ఫైల్‌ అయితే, వెనక్కి తీసుకోలేము. యువత ఇందులో ఇరుక్కొవద్దు. ఈరోజు ప్రతిదీ ట్రాక్‌ చేయొచ్చు. సైబర్‌ పోలీసులకు ఇది మరింత ఈజీ. ఈ రోజు కేసులు వేశాం. ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించింది. మూడో రోజు సినిమాని ఎపీఎస్ ఆర్టీసీలో వేస్తే నిర్మాతలు ఇంకమేము ఏం చేయాలి. 

ఈ పైరసీలో మొదటి బాధితుడు పవన్‌కల్యాణ్‌గారు. అత్తారింటికి దారేది ముందే విడుదలైంది. ఈ విషయాన్ని ఆయన దృష్టికీ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం. తండేల్‌ పైరసీ కాపీ 100శాతం ఓవర్సీస్‌ నుంచే వచ్చింది. ఇది తమిళ ప్రింట్‌ నుంచి వచ్చింది. దానికి తెలుగు ఆడియో కలిపారు. అది కూడా గుర్తించాం. క్యూబ్‌లో కోడ్‌ ఉంటుంది. కానీ, పైరసీ కాపీలో ఆ కోడ్‌లేదు. ఎక్కడి నుంచి వచ్చిందనే దానిని గుర్తించే పనిలో ఉన్నాం. ఈ విషయంలో నిర్మాతలకు మన ప్రభుత్వం చాలా బాగా సపోర్ట్‌ చేస్తోంది. పైరసీ చేసిన వాళ్లకి, దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లకీ కేసులు వర్తిస్తాయి. 

మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసినా కేసు పెడతాం. చివరి వరకూ పోరాడుతాం. తండేల్ పైరసీ చేస్తే 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి. అభిమానులు చేయాల్సింది ఇదొక్కటే. సాక్ష్యాలు ఉంటే కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. ముఖ్యంగా అక్కినేని అభిమానులకు చెబుతున్నాను. చైతన్య గారికి చాలా మంచి సినిమా తీసిఇచ్చాము. ఆయన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ అయ్యే చాన్స్ వుంది. అన్ని విధాలుగా ప్రమోట్ చేస్తున్నాం. అలాంటి సినిమాని కాపడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీకూ వుంది. పైరసీ జరిగితే ఈ నెంబర్ కి మెసేజ్ పెట్టండి అంటూ బన్నీ వాస్ ప్రెస్ మీట్ లో స్పందించారు. 

Atrocity- Thandel piracy in RTC bus:

Thandel Film Illegally Screened on APSRTC Bus Producer Reacts

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ